పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

ద్విపదభారతము


నుతశక్తి భీమసేనుం డితఁ డనుచు
నతనిపే రెఱిఁగించె నాకాశవాణి.
భూతలాధిపుఁ డంతఁ బొంగుచు వచ్చి
సూతికాగృహములో సుతుమోముఁ జూచి :
'హస్తినాపురభాగ మన్న యీకున్న
నస్తమింపదు; వీని కది సాధ్య ' మనుచుఁ,
గౌంతేయుఁ బట్టంబుకట్టిన[1]కంటె
సంతోష మాత్మలో సంధిల్ల నుండె.
పురుఁడు వచ్చిననాఁడె పూఁబోఁడి యంత
సరసిలో మంగళస్నానంబు చేసి,
[2]నవరీతి నుదికిననారపుట్టంబు
సవతియిచ్చిన నది సంప్రీతిఁ దాల్చి,
యుడురాజశేఖరు నుపహారమునకు
నొడిపిలి పాయసం బొప్ప [3]వండించి,
భామిని మాద్రిచేఁ బట్టించుకొనుచుఁ
గోమలి సుతు నెత్తుకొని పెద్దవేడ్కఁ
బోవుచో, నొకశైలభూరిరంధ్రమున
నావలఁ బులియుండి యది మాంస మనుచు
ఘోషించి యది వేగ గొటగొటమనుచు,
భీషణగతితోడఁ బృథకడ కపుడు
గమికొన్నయాఁకటఁ గదియఁ బాఱుటయు,
బ్రమసి భీతినిఁ గూడి పాండునిదేవి
కొడుకు నచ్చట కొండ [4]గుండులమీఁదఁ
బడవైచె మూర్ఛచేఁ బరవశయగుచు;
వైచిన, నాభీమువజ్రకాయమున
నేచినఱాలెల్ల నిసుమయ్యె నందు.

  1. గంట్టె
  2. నవవార
  3. వడ్డించి
  4. గుడ్లల (మూ)