పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

220

ద్విపదభారతము


కన్నియవయసునఁ గడువేడ్క నేను
దన్ను నారాధింపఁ, దపసి వ్యాసుండు
'తనయుల నీ కిత్తుఁ దరుణి, నూర్వురను '
అనువరంబున కింతయాస నుండితిని.
ఏ నేమి పాపినో! యెందఱనైనఁ
గానంగ మీనునో కడునాసగాక!”
అని [1]కుంది, కుంతి తా నాత్మజు మున్ను
గనిన నెం[2]జెలిని నాకాంత రోషించి
ప్రేవులు పొదివింపఁ, బితరులు నవ్వ,
దైవ మంతట నవ్వ తనయులు నొవ్వ
ననయంబు తెగువతో నర్ధరాత్రమునఁ
దనకుక్షి కరములఁ దాటించుకొనిన,
మలఁగఁ బక్వముకానిమాంసపుముద్ద
గలఁగి ధారుణిఁ బాఱఁ, గడువేగ వచ్చి
ద్వైపాయనుండు గాంధారిఁ గోపించి:
"చాపలంబున నిట్లు సాధ్వి, చేయుదురె!
వరము బొంకైన నెవ్వారైన నగరె!
సరి, యిందు నందనశత, ముద్భవించు."
నని చెప్పి యా వేళ నలుగునఁ గోసి,
కనుఁగొన నూఱునొక్కటి పంచి వైచి,
కలసినవేదశాఖలఁ జిక్కుపుచ్చి
[3]చెలువారఁ బంచివైచిన పెద్దగాన,
నేతికుండలఁ బెట్టి నిత్యంబు నందు
శీతలజలములు చిలుక నేమించి
యేఁగిన, మఱియొక్క యేఁటికి వెనుక
వ్రేఁగున నొకకుండ విరియుచో, నందు

  1. గంటి
  2. జెలిమి
  3. జెలపాఱ (మూ)