పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

ద్విపదభారతము


నుండి మందసఁ గాంచి యొయ్యనఁ దెచ్చి,
కుండలాంచితు నందుఁ గొడుకు వీక్షించి
మిన్నంది : 'యిదె నాకు మృడుఁ డిచ్చె సుతునిఁ;
దన్నితి ననపత్యతాదోషముఖము;
నీకున్న నెవ్వఁ డీయేఱులవెంట
నీక్రియ విడుచునే యిటువంటివాని!'
అని రాధ యనుదాని కాకర్ణు నొసగ,
వనిత చన్నులు చేఁపి వాని నేర్పునను
యౌవనప్రాప్తుఁగా నరసిన, నతఁడు
వేవేగఁ గృపునిచే విలువిద్య నేర్చి,
పోయి బ్రాహ్మణవేషమున రాము మొఱఁగి,
ధీయుక్తి సాధించె దివ్యబాణములు.
ఈ తెఱంగునవచ్చె నింతి కామంత్ర;
మాతరువాతివృత్తాంతంబు వినుము.
అంతన క్కడ మున్న యాపాండురాజు
చింతించి యనిచినసేనలు దొరలు
హస్తినాపురమున కడలుచుఁ బోయి,
వస్తువాహనములు వసుధాధిపతికి
నిచ్చి పాండునిచంద మెఱిఁగింప, నతఁడు :
"వచ్చె నాపద ; యిట్టివార్తయుఁ గలదె!
దిక్కెవ్వరున్నారు! తెఱచినయిల్లు
కుక్క చొచ్చినయట్లు కురుభూమి కింక
వత్తురు వైరులు; వారిపై నెవ్వ
రెత్తిపోయెడువార! లేఁగంటఁగాన.
వికటశాపాంధుఁడై విడిచి పోనేల!
యొకరీతి నాయొద్ద నుండినఁగాదె!
నాలుగుదిక్కులు నలువొప్ప గెలిచి,
యీలీల సంపద లిరవొందఁగలిగి,