పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

213


ఏము జనించితి మీప్రకారమున;
భామిని, పిలుతునా! బ్రాహ్మణు;" ననినఁ :
“బతివి నీవైయుండ భరతవంశేంద్ర,
యితరుని మనసులో నెట్లు నిల్పుదుము!
పతి యేమి చెప్పినఁ బని వడి సేయ
కతివల కుండుట యధికపాతకము,
తలఁప, నీవలననె తనయులు మాకుఁ
గలుగు నుపాయంబు గావింపు; మిదియె
తపము సేయుట; మేలు దపమునఁ దొల్లి
[1]వపితాశ్వు సతికి దైవం బిచ్చె సుతుల,
'పుత్త్రులు దేవాంశమునఁ బుట్టఁగలరు
ధాత్రి నీ ' కన్నారు తపసులు వినవె!
నీ వేమి చెప్పిన నీ చెప్పినట్లు
గావింతు; మిం తేల కడఁక [2]నీ కిపుడు!
తమకింపవల." దని తరుణి యాడుటయు,
రమణుఁ డిట్లను: "నోర్వరా దంతతడవు;
తనువు లెవ్వఁడు నమ్మెఁ! దలఁచిన ట్లగునె!
'దినహాని శుభములు దిను' నని వినవె!
ఇంతి, సేయుదుగాక యేఁ జెప్పినట్లు;
కాంత, వేగమె పిలు ఘను నొక్కమునిని;
మానినిఁ బనిచి కల్మాషపాదుండు
పూని వశిష్టుచేఁ బుట్టించె సుతుని;
మామతేయునిఁ దెచ్చి మగువతోఁ గూర్చి,
యామగధుఁడు తొల్లి యాత్మజుఁ గాంచె;
సందేహ మేటికి సాధ్వి నీ?" కనిన,
నిందువంశ్యునిఁ జూచి యిందీవరాక్షి :

  1. 'వ్యుక్షితాశ్వుసతి' అని నన్నయ. ఆది. ప.
  2. గావుడును (మూ)