పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

ద్విపదభారతము


"పాయనోవము నిన్ను బాండుభూపాల!
యేయనువుననైన నేము విచ్చెదము,
అకట! శంతనువంశ మణఁగినచోట
నొకభాగ్యమహిమచే నుదయించి తీవు.
కులము నిల్పెదవని కోరియుండంగఁ
గలిగెనే నీ కిట్టి కారణావస్థ!
ఏమి చేసిన నాఱు నీపాతకంబు!
........ ......... .......... ......... ........
రతిలేక యుండవు రాత్రి యెన్నఁడును;
రతి చేసి తనియవు రమణ, యెన్నఁడును.
పరఁగ నిప్పటినుండి బ్రహ్మచర్యంబు
చరియింపనోపుదే జగదీశ నీవు!
ఇది పురాతనదోష మే మనఁగలదు!
విదితాత్మ, నీ వింక వినుము మామాట ;
శైలాటవుల నొంటిఁ జరియింపవలదు
లాలితజటలవల్కలములుఁ దాల్చి :
యడరి వానప్రస్థ మనునాశ్రమమున
నడపుము మమ్మును నరనాథ, కూడి.
ప్రాణేశ, ని న్నేము పాయుదుమేని,
ప్రాణంబులును మమ్ముఁ బాయు నాక్షణమె.
సతితోడ రామభూజనపతి గూడి
ధృతిపట్టి యడవి వర్తింపఁడే మున్ను!
అటుగాక, నిను బాసి హస్తినాపురికిఁ
బటుభంగి నరుగంగఁ బదము లెట్లాడుఁ!
బొనరంగ మధ్యాహ్నమున నిట గ్రుంకి,
యనలుని వ్రేల్చుచు నతిథిఁ బూజించి,
జలములఁ బితరుల సంత[1]సపెట్టి,
నిలువవె! మాకును నీడ యయ్యెదవు. "

  1. బెట్టుచును (మూ)