పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

205


యతిమృగయాసక్తి నాదశరథుఁడు
....... ........ ........ ......... ......... ........
....... .......... ......... ........... ........ .......
....... ......... ......... ........ ........ ........
ధర వేట మున్ను సప్తవ్యసనములు
[1]నిరవొప్పఁ గీడని యెదఁ గానలేక
తనపాలివిధి తన్నుఁ దవిలిప్రేరేప
ననఘ, కార్యాకార్య మది యెఱుంగకయు,
నిది చంపఁదగినది, యిది కావఁదగిన,
దిది యది యనుబుద్ధి యిసుమంతలేక,
యటపోయి యటపోయి యద్రులు గడచి,
కుటిలమహాటవీకోట్లును గడచి,
మునులున్నయాశ్రమంబులు పెక్కు గడచి,
యొనరఁ గార్యాంధుఁడై యొకనాఁటి వేఁట
లేడియిఱ్ఱియు రెండు లీలఁ గ్రీడింప
నోడక యేసిన, నుఱక మూర్ఛిల్లి
తెలిసి యొయ్యనఁ గన్ను తెఱచి యాయిఱ్ఱి
పలికె మానుషభాషఁ బార్థివోత్తముని :
"ఓపాండుభూవర, యోరాజచంద్ర,
యీ పాపమున కొడి యేల గట్టితివి !
పగఱపై నీబాణపస చూపలేక,
మృగములమీఁదనే మెఱసి చూపితివి.
పోలేక రతిసౌఖ్యములనున్న మమ్ము
నేల యేసితివి! యి ట్లేయంగఁదగునె!
మించి నీకు వధింప మృగములు లేవొ !
పొంచి మావిధమంత పొడగానవైతి.

  1. నిలనొప్పఁగీడనియిల (మూ)