పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

204

ద్విపదభారతము


తెరవేట వలవేట ధృతిజొంపువేట
మఱి [1]మఱివిడివేట మచ్చువేటయును,
గంటవేటయు వేడ్కగలకోలవేట
వెంటవేటయు నిడువేటయు నాడి,
యొఱపులై క్రొవ్వి మిన్నొరయుజంతువుల
నఱికివ్రేసియు, మఱి నాటనేసియును,
జించియు నొంచియు జీవనాళములు
త్రెంచియుఁ ద్రుంచియు ధృతినొక్కయెడల
నుంకించియెగసిన యుగ్రపుమృగముఁ
గొంకులునఱికియు, గొందిలోనిఱికి
గవినుండివెడలక గాఱించుమృగముఁ
దవిలిపట్టించియుఁ, దగులసేసియును,
జొంపులోపలదాఁటి సురిగినమృగముఁ
బుంపులుపుచ్చియుఁ, బోవనిచ్చియును,
తెంకిచేరక యొంటిఁదిరిగెడుమృగము
దొంకలుమూసియుఁ, ద్రోవ సేసియును,
వలఁజొచ్చిమించి యావల నేఁగుమృగము
నలి నడ్డగించియు, నడుముఁద్రుంచియును,
బిలమాక్రమించుచోఁ బిల్లలఁబొదివి
బలముననోండ్రించి పాఱినపంది
మననువట్టక టెంకిమగుడఁజేరినను,
గనికరంబున దానిఁ గాచిపుచ్చియును,
ఈరీతి వేఁటాడి యిభపురికతఁడు
తోరంపుమృగకోటిఁ దోడ్తోడ వేడ్క
నన్నకునిమ్మని యనిసిపుచ్చుచును,
విన్నాణమగువేఁట విడువంగలేక

  1. వొడునన్ వేట (మూ)