పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

203


నాశచేసెదమన్న నడఁగవుమాకు;
మాశరమ్ములవాఁడి మాసె ర" మ్మనినఁ,
బాండుభూపతి వేఁటపై నాసపుట్టి
పొండు వచ్చెద నని బోయలఁ బనిచి,
యన్నకు నెఱిఁగించి యనుమతి వడసి,
సన్నుతిఁ దనమంత్రిసంఘంబుతోడ
గొల్లెనకంబాలు గొడుగులుఁ బడగ
లల్లికవలమోపు లమ్ములబండ్లు
మెత్తనిశయ్యలు మెఱుఁగుకొప్పెరలు
ముత్తియంబుల పవడముల పల్లకులును
బసిఁడిమంచములును బట్టు మేల్కట్లుఁ,
బొసఁగ సరాతులు బోనకావళ్లుఁ
బరిచారకులుఁ బాఁడిపసులు బియ్యములుఁ
బరిమళవస్తుసంపదలు నేతేరఁ,
జపలాక్షు లిర్వురు సంప్రీతిఁగొల్వ,
విపులయాత్రాభేరి వేయించి కదలి,
కరి రథ సుభ టాశ్వ ఘన [1] పాదధూళి
యరుణున కరుణత్వ మచ్చుగాఁబొదువ,
దారుణహిమశైలదక్షిణాటవుల
వీరప్రతాపుఁడై వేఁటలాడుచును,
వాహనంబులు వెంటవచ్చుటె గాని
సాహసంబునఁ బాదచారంబు గలిగి,
నదులైన నీఁదుచు, నగములమీఁదఁ
బొదలైన నెక్కుచుఁ, బులి పంది వెనుక
చఱినైన నుఱుకుచు, సాగనిపూఁట
[2]నెఱచైన నమలుచు నీరీతిఁ [3]దిరిగి,

  1. రథ
  2. నెరుపనై
  3. దిగిచి (మూ)