పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

197


పాండుని యువరాజ్యపట్టంబు గట్టె.
............ ................ ............ ..........

పాండురాజుదిగ్విజయము

చంద్రప్రకాశుఁడై జగతిపై నతఁడు
సాంద్రవైభవముల జనులెల్లఁ బొగడ
సుఖలీలఁ దనరుచు, శూరాగ్రగణ్యుఁ
[1]డఖిలదిగ్విజయార్థ మరుగంగఁ దలఁచి,
పటుమతిఁ జతురంగబలములు గొలువఁ,
గుటిలారి నరపాల కులశైల వజ్ర
[2]తులితుఁడై తొలితొల్లి తూర్పున కేఁగి,
బల[3]సమగ్రుల నరపతుల సాధించి,
యట దక్షిణమునకు నరిగి, మార్కొనిన
పటుభుజాబలుల భూపతుల నోడించెఁ;
బడమటి కరిగియు బహుధరాధిపులఁ
గడిమిమై నసమసంగరమున గెలిచె;
నుత్తరంబునఁ గల్గు నుర్వీశవరుల
నొత్తి యుద్ధంబున నుదుటెల్ల నణఁచి,
[4]యుల్లాసముననుండి యుర్వినల్దెసల
నల్లనల్లన నొత్తి యరుల సాధించి,
యక్కజంబుగ బల్మి నట వారిచేతఁ
బెక్కుగజంబులఁ, బెక్కుగుఱ్ఱముల,
రమణీయగతి నవరత్నరాసులను,
బ్రమదాజనంబుల, బహువస్తువితతిఁ
గప్పంబుగాఁదెచ్చె; గనకాంబ[5]రంబు
లుప్పతిల్లినమాడ్కి [6]నూరివారెల్లఁ

  1. డిల
  2. తూలితుఁడ.
  3. సమగ్రతుల
  4. యుల్లంబురానుండి యుర్వి యెద్దెసల
  5. రాదు
  6. నూరనెల్లెడల (మూ)