పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

196

ద్విపద భారతము


ననియని విదురాదియాప్తులతోడ (?)
ఘనుఁడు భీష్ముఁడు ప్రసంగముసేయుచుండె.

పాండురాజు కుంతిని వివాహమాడుట

అంతట, యదువంశ్యుఁడగు శూ -- సుతకుఁ
గాంతాలలామకుఁ గమలనేత్రకును
గుంతిభోజుఁడు తన్నుఁ గూఁతుగాఁ బెనిచి
సంతసింపఁగ నొప్పు సౌభాగ్యవతికిఁ ,
జెలఁగి దుర్వాసుఁ డిచ్చినమంత్రశక్తి
నెలమి మానవులకు నెఱుఁగరాకుండఁ
జండాంశువలన నచ్చపువజ్రకవచ
కుండలాలఁకృతు గురుయశోధనుని
ఘనుఁ గర్ణుఁ గని తనకన్యాత్వహాని
జనియింపకుండఁగఁ [1]జరియించుసతికిఁ,
బృథయనఁ గుంతినాఁ బెంపువహించి
ప్రథితనామంబులఁ బరగుకోమలికి
నలరు స్వయంవరమనువార్త పుడమి
వెలయంగ మ్రోయుట వేగుచే నెఱిఁగి,
యంతట నొక్కనాఁ డాపగేయుండు
కుంతిభోజునికూఁతుఁ గుంతియన్ దాని,
మద్రరాజతనూజ మాద్రియన్ దాని,
భద్రాత్ముఁడైన యాపాండురాజునకు
వీరస్వయంవరవిధిఁ దెచ్చి యిచ్చెఁ.
గోరి నూర్వురఁబెండ్లికూతుల మఱియు
నక్కడక్కడఁ దెచ్చిఁ యాంబికేయునకుఁ
దక్కక వంశవర్ధనకాంక్ష నిచ్చి,

  1. జనియించు (మూ)