పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

195


బంగారుపట్టంబు పడఁతి దెప్పించి,
పొంగారువేడ్కఁ గప్పురము మెత్తించి,
సోగలై మెఱుఁగెక్కు సొబగుకన్నులను
బాగులై లేనవ్వు పర్వమై నిక్కు
చెంగావికొలుకుల సిగ్గుకందువలఁ
దొంగలిఱెప్పల దొరయునేత్రముల
మూయించెఁ; బతినింద మును జేసియున్న
దాయలనోళ్లెల్లఁ దా మూసె ననఁగ.
అప్పు డాగాంధారి నర్థిఁ బూజించి,
తప్పక పసిఁడియందల మెక్కఁ బనిచి,
తోయజాక్షుల దానితోడఁబుట్టువుల
నీయెడఁ దొమ్మండ్ర నిచ్చితిననుచు
జనపతి రప్పించి, శకునిఁ దోడంపి,
యనిచెఁ గాంచనకోట్లు నందఱ కొసగి;
యనిచినఁ గొనితెచ్చి, యాపగేయునకు
జనపతికూఁతుల శకుని చూపుటయు,
నొక్కలగ్నంబున నువిదలఁ బెండ్లి
యక్కొడుకునకును నతిభక్తిఁ జేసి,
గాంధారపతులకుఁ గట్నంబు [1]లీయ,
బంధుసామగ్రి యేర్పడ సంతసిల్లె.
ఘనుని నిశ్చలుని సంగ్రామభైరవుని
నిననిభతేజుని నింద్రవైభవుని,
శరనిధిగంభీరు సన్నుతాకారు
భరతవంశేశునిఁ బాండునిఁ జూచి :
‘యితనిచేఁ గురువంశ మెల్ల వర్ధిల్లు;
నితనిపెండిలి సేయ నెలమిమై వలయు'.

  1. లిచ్చి (మూ)