పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

ద్విపద భారతము


"అంగంబులందెల్ల నతిశయ ముత్త
మాంగ; మందును గన్ను లరయంగ మేలు;
జనులకు నిట్టిలోచనములు లేమిఁ
బెను [1]చిక్కులగు నిచ్చ; ప్రియతనూభవయు
గాంధారి సర్వలక్షణలక్షితాంగి
యంధున కక్కటా! యాలు కాఁదగునె!
ఈనాతి నంధున కీకున్న నేమి!
మానుగా మగపోఁడి మానంద మిడునొ!
భువిలోన మగవాఁడు పుట్టఁడొ కాక!
యవనీతలేశున కల్లుండు గాఁగ.
పడఁతిసౌందర్యంబు పతికట్టెదురను
అడవిఁగాచినవెన్నె లైపోవఁగలది!
ఈవల శకునియు నిట 'తండ్రిమాట
గావలె' ననుఁ; గాని, కాదనవెఱచు."
ననుటయు, గాంధారి యచ్చోటనుండి
మనుజులమాటకు మది నొచ్చి పలికె:
"క్షితిపతి [2]నన్ను నిచ్చితినన్నమాట
ధృతరాష్ట్రునకు నేను దేవి నై నట్ల;
పతి యతఁడేకాక, పరికింప [3]నాక
పతియైన, మఱి రతిపతియైన నొల్ల.
సింధురశతములఁ జెనకు బలాఢ్యుఁ
డంధుఁడై రాజ్యమదాంధుఁడు గాఁడు.
చతురుఁడు, జ్ఞానలోచనసహస్రాఢ్యుఁ,
డతని నూరక యంధుఁడన నెట్లువచ్చు!
ధృతరాష్ట్రునకులేనిదృష్టి నా కేల!
హితమతిఁ జూడుఁడీ యిందఱు!" ననుచు

  1. చిక్కునకు
  2. నన్నును యిచ్చితినన్న
  3. నాకు (మూ)