పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము ; చతుర్థాశ్వాసము.

193


గావున, నితనికి గాంధారు పుత్త్రి
దేవి గాఁదగు నెల్ల తెరవుల; మఱియుఁ
దనయులు నూర్వు రత్తరుణికిఁ దోతు
రని వింటి వ్యాసవరానుభావమునఁ;
దొయ్యలు లయ్యింతితోడఁబుట్టువులు
నెయ్యంబుగలవారు నధిసంఖ్యగలరు.
పుత్తమా! యచటికి భూసురోత్తముల
విత్తంబు లిచ్చి యావెలఁదుల నడుగ."
ననుటయు విదురుండు 'నదికార్య' మనినఁ,
బనివడి యెంతయు బ్రాహ్మణోత్తములఁ
గన్యకావరణంబు గావింపఁ బనుప,
సైన్యసహాయులై చనుదెంచి వారు
గాంధారు సుబలునిఁ గాంచి, కౌరవుల
బంధుత్వ మతని కేర్పడ మాటలాడి:
'సుతను గాంధారిని సుతను సుచరిత
ధృతరాష్ట్రు [1]కడిగి యాదేవవ్రతుండు
పుత్తెంచె; సోదరీపూర్వంబుగాఁగ
నిత్తుగా.' కనుటయు నిట్లను నతఁడు :
"కురువంశవిస్తారకుఁడు ధృతరాష్ట్రుఁ
డరయ నీకన్యకు నర్హుండు; గాన,
సచ్చరిత్రునకు నాజనవరేణ్యునకు
విచ్చలవిడితోడ విశ్వంబు మెచ్చ
నిచ్చితి;" నని తండ్రి యియ్యకొన్నంత,
మెచ్చక యచ్చోటి మేదినీజనులు
నతనిబంధువులును నట తమలోన
హితవేది గుజగుజ ని ట్లని రపుడు :

  1. కడిగెను (మూ)