పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

ద్విపద భారతము


అంతయెఱుంగక యనుచితదండ
మంతక, నాయెడ నాచరించితివి ;
శూద్రుఁడవై పుట్టు క్షోణిలో. ' ననుచు
నుద్వృత్తకోపుఁడై యొనర శపించె.
అదికారణంబుగా నంతకుండిట్లు
విదురుడైఁ జన్మించె విను. " మని మఱియు
జనమేజయునకు వైశంపాయనుండు
వినిపించెనని ప్రీతి వెండియుఁజెప్పె.
మానదుర్యోధన, మదన [1]సమాన,
మానవతీమాన్య, మదనాభిరామ,
రామణీయకధామ, రామాభిరామ,
రామాయణానంద, రక్షా ప్రసార, (?)
సారస్వతామోద, సత్యవిహార,
హార నూపుర కంక ణాంగద యోగ,
యోగనిర్మలభాగ, [2]యుచితసంభాగ,
భాగవతాధార, భాగ్యాప్తినీకు.
ఇది సదాశివభక్త హితగుణాసక్త
సదయస్వరూప కాశ్యపగోత్రదీవ
శ్రుతిపాత్ర వల్లభనూరిసత్పుత్ర
మతిమద్విధేయ తిమ్మయనామధేయ
రచితాదిపర్వ నిర్మలకథయందు
నుచితమై యాశ్వాస మొప్పె మూఁడవది.


__________
  1. సరామ.
  2. ఉచితానుభాగ. (మూ)