పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ద్విపద భారతము


అరయ నట్టిద కాదె యధికకామంబు
నరులకుఁ గొఱగాదు నయవిధిఁజూడ.
గాంగేయు భూనాథుఁగాకుండ నడిగి
యంగననిచ్చిన నదియేలవెలయు !
అనుజుఁడిట్లేఁగిన, నాపగేయుండు
మనమున శోకాగ్ని మంటయై మండ
దీనుఁడై, యెవ్వరుఁ దెలిపినఁ దెలివి
నూనక మూర్ఛిల్లి యొక్కింతదెలిసి :
"శంతనుమాఱుగాఁ జర్చించి మిమ్ము
నెంతయు నరసితి నేఁ దమ్ములార !
[1]ఒమ్మగుపనిగాఁగ నొకమాను వొడువ
బొమ్మరమ్మును గాకపోయినట్లయ్యె !
ఇలకు విచారింప నే నున్న వాఁడఁ !
గులసూత్ర మింతతో గుఱుచయయ్యెడినొ!
ప్రాణసాధ్యంబైనపని గాదుగాక,
ప్రాణంబునకు నడ్డపడనె యింతకును ! "
అనియేడ్చి యతనికి నపరకర్మముల
నొనరించి, యరయుచునుండె భూతలము.

చంద్రవంశోద్ధరణకై నత్యవతి ప్రయత్నము

నిత్య నిస్‌స్పృహవృత్తి నెగడినయతని
సత్యవతీ దేవి జపవేళఁ గదిసి,
విపులచంద్రముఖంబు వెసవాంచియున్న
యపరయామినివోలె నాస్యంబువంచి,
యెలుఁగు [2]డగ్గువడంగ నేడ్చుచుఁబలికెఁ :
"గలరెధర్మజ్ఞులు ఘనుఁడ, నీకంటె!

  1. వమ్మయ్యె పనిగానువొక.
  2. డగ్గలరంగ. (మూ)