పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

ద్విపద భారతము


కమనీయ కమలినీ కబళనార్థంబు
కమలాకరముఁజొచ్చు గజమునుబోలె
మచ్చుగాఁ బన్నినమంచెలమీఁదఁ
జొచ్చి, కాశీశుండు చూడఁజూడంగ,
నంబుజగంధుల నంబ యంబిక యు
నంబాలికయు ననునట్టి కన్యకలఁ
దనరథంబెక్కించి దర్పించిపలికె:
“మనుజేంద్రులార, యేమఱియుండవలదు ;
అనుజునిపెండ్లికి నఖిలంబు నెఱుఁగఁ
గొనిపోవుచున్నాఁడఁ గుటిలకుంతలుల.
అసుర బ్రాహ్మంబులను వివాహముల
నాసుర మీ పెండ్లి; యర్హంబు మాకు ;
పెనఁగివినుండు నా పేరుభీష్ముండు ;
వినుఁ డొంటివచ్చితి విల్లునునేను ”.
అనిపోవఁ, బోనీక యడ్డంబుదాఁకి,
జననాథు లస్త్రశస్త్రంబులచేత
ముంచిన, నతఁడు రామునిశిష్యుఁడౌటఁ
బొంచి యూనృపవైరమునఁ బెచ్చు పెరిగి,
యనుపమాస్త్రంబుల నవి ద్రుంచివైచి,
తనరథ వేగంబు దప్పకయుండఁ,
గృత్తసూత రథాశ్వ కేతన చ్ఛత్ర.
మత్తేభ [1]కుంభముల్ మార్గంబుదెలుప,
విచ్చుచుఁ బొదువుచు వెస భానుమీఁద
వచ్చుమంచువిధంబు వైరులు దెలుప,
నావలవెడలినయతనిబాణములఁ
బ్రేవులుదునిసియుఁ, బృథివివ్రాలియును,

  1. శుభముల. (మూ)