పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

177


అంత నే తెంచెఁ జిత్రాంగదుఁడనఁగఁ
గాంతిభీకరుఁడైన గంధర్వుఁ డొకఁడు ;
ఏ తెంచి యారాజు నిట్లనిపలికె:
"భూతలాధీశ, చెప్పుదురు నీలావు;
అష్టదిక్కరులను నడిగితి రణము;
నష్టదిక్పాలుర నడిగితి రణము ;
నెందులేదు ; భుజంబు లేర్పులు వట్టె ;
విందుసేయుము మల్లవిద్య నా”. కనుచు
నరులుఱిచ్చవడంగ నలినాక్షులేడ్వ,
దొరలునివర్తింపఁ దోడ్కొనిపోయి,
భూరి కురుక్షేత్రమున నాజిచేసి,
యా రాజుఁ దెగటార్చి యాతండువోవ,
నొక్కింతశోకించి, యూర్ధ్వకృత్యములు
తక్కక భీష్ముఁ డాతనికిఁ జేయించి,
యుర్వి కాతనితమ్ము నొడయనిఁజేసి
సర్వంబునడపుచో ; [1]జగతిలో నంత,

కాశిరాజుకూఁతుల భీష్ముఁడు తోడ్తెచ్చుట

మువ్వురుసుతలకు మొగిఁ గాశిరాజు
జవ్వనంబునఁ బెండ్లిసమకూర్ప వలసి
వీరస్వయంవరవిధికి భూవరుల
వారక పిలిపించువార్త పుట్టుటయు,
నొక్కఁడు రథమెక్కి, యుర్విగ్రక్కదల
గ్రక్కున భీష్ముఁ డాకాశికిఁ బోయి,
తప్పక వీరులందఱు నల్గువాతి
కప్పలగతినుండఁ గనుఁగొని నవ్వి,

  1. జనులలో. (మూ)