పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిపర్వము ; తృతీయాశ్వాసము.

173


గ్రామంబులిత్తునో ! కరులుగావలెనొ !
హేమ మౌక్తిక రాసులిత్తునో తనియ !
నెయ్యది నీకోర్కె ! యెఱిఁగింపు. " మనినఁ,
దియ్యనిమాటల దేవలుండనియె:
“హరిణలోచనఁ బెండ్లియాడెదు గాక ;
ధరణీశ, నీకంటెఁ దగువారువేరి !
ఉంకువ నీచేత నొల్లముగొనఁగ;
నింక చెప్పకపోదు హితలీల వినుము ;
నాపుత్రికుదయించు నందనునంద
యువరాజభారంబు నున్పనోపుదువె!
ఓపిన, నిది నాకు నుంకువ ". యనినఁ,
గోపమించుకవచ్చి కువలయేశ్వరుఁడు :
"ఆపగేయుఁడు రాజ్య మరయుచునుండ,
నీపని యెట్లుగా నేనియ్యకొందుఁ !
గట్టిడికార్యంబు, కళ్యాణియైనఁ
గట్టినట్లున్నది కడునాత్మనాకు. "
అనిఖిన్నుఁడై పోయి హస్తినాపురము,
తనయిల్లువెడలక తాపభారమున,
వాలినమొగులులో వనజాప్తుఁ [1]డట్లు
చాలఁదూలిన జీర్ణచంద్రుండువోలెఁ
గుంభినీజనులకుఁ గొలువియ్యకున్న,
గాంభీర్యజలరాశి గాంగేయుఁ డెఱిఁగి,
యయ్యెడ నొక్కనాఁ డయ్యయున్నె డకు
నొయ్యన సుముఖుఁడై యొక్కఁడుఁ బోయి:

భీష్మ ప్రతిజ్ఞ

“యిదియేమి తండ్రి ! నీవెన్నఁడు [2]లేదు,
చెదరియున్నావు నీచిత్తంబులోన !

  1. డున్న.
  2. లేమి. (మూ)