పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

169


చాలించి పోయెద జాహ్నవి నేను ;
బాలు నేఁ గొనిపోయి భక్తిఁబెంచెదను
యౌవనప్రాప్తితో నరుదెంచు నిచటి
కీవసుంధరకెల్ల నితఁడొడయండు;
పుట్టుచు మరణంబుఁబొందినవారు
నెట్టన వసువులు నేఁడైన నెఱుఁగు;
వారి వశిష్ఠుండు వసుధపైఁ బుట్ట
నీరీతిఁ బొమ్మన్న నే తెంచినారు ;
ఒప్పుగా నీచేత నుపకృతులైన
యప్పుణ్యు లొక వేళ నగుదురు నీకు. "
అనిచెప్పి, గంగ రయంబెసగంగఁ
దనయునిఁగొంచు శంతనుడించి పోయె.
అంత నూరికివచ్చి, యతఁడవ్వధూటిఁ
జింతించి చింతించి చిత్తజుండేఁప,
నూరిపట్టున నుండ నుల్లంబురాక
వీరవర్గముగొల్వ వేటాడవెడల,

శంతనుఁడు భీష్మునిఁ బడయుట

భాగీరథీ నదీ పథమునఁ దొంటి
భోగభూమికిఁ బోయి పొడగనునపుడు,
కదిసి యోడలఁగాని గడువంగరాని
యుదకంబు సన్ననై యుబ్బెల్లస్రుక్కి,
పలుచనై చెదరుచుఁ బొకుఱాళ్లకును
నలబల సేయుచు నడుమంటస్రుక్కి,
యారీతిఁ దనుబాసి యాకాశగంగ
భూరి తనుత్వంబు పొరసెనోయనఁగ
జాలువారుచునున్న సందియంబంది
హేల [1]ప్రయాణమై యెగువకుఁ బోయి,

  1. ప్రమాణుఁడై. (మూ)