పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

ద్విపద భారతము


ౘఱ్ఱన రేఁగి యాజాహ్నవిఁ జూచి :
“వెఱ్ఱిదానవుగాక వెలఁది, నీకడుపు
చుఱ్ఱనకున్నది చోద్యంబు చూడ !
వఱ్ఱువచ్చిన నట్లు వలచితి గాక,
కొఱ్ఱుమ్రింగినయట్లు కొంత గై కొంటి
నఱ్ఱుత్రొక్కిన నడ్డ మాడరాదనుచు.
జుఱ్ఱఁజూచితి నీవు సోమకులంబు !
మఱ్ఱినుండెడు భూతమాతవు గాక,
కఱ్ఱువట్టిద (?) నీవు కాంతవుగావు.
ఒఱ్ఱెలాగునను ని న్నొకమాట యన్న,
జఱ్ఱన [1]జూఱెదు సంసార మెల్ల.
విఱ్ఱవీగక నీవు విడిచిన, మాకు
జెఱ్ఱికి నొకకాలు చెడినట్లు [2]సకియ !
తిఱ్ఱిఁబోసిననీళ్లు తెఱవ, నీబ్రదుకు ;
గొఱ్ఱెదూడలఁ జేస్తి కొడుకులనెల్ల.
ఉఱ్ఱూఁతలూఁగు నీయురుకుచద్వయము
ముఱ్ఱుపా లేబిడ్డ మూతిఁ బట్టితివి !
కుఱ్ఱలవంటి నాకొడుకుల మ్రింగి,
గఱ్ఱనఁ ద్రేంచెను గంగలో మీలు!
అఱ్ఱాడి మ్రింగిన నట మ్రింగనిమ్ము,
తఱ్ఱ, [3]యెత్తెద వాని దయమాటలాడి.
మిఱ్ఱుగాదే యెల్లి మిన్నేరు ! పూడ్చి,
కొఱ్ఱవిత్తించెదఁ గోపంబు మాన ;
ఈకుమారకు జముకీకు మాఱకము;
నీకు మాఱాడితి నేఁ"; డన్న నవ్వి:
“వీటికి నామీఁద నింతకోపంబు!
వాటంపునెయ్యంబు వలదన్న మాని,

  1. జారదు
  2. సతుల
  3. మొత్తెద. (మూ)