పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

164

ద్విపద భారతము


పడతి [1] యిట్లనుపఁగఁ, ద్వర వాఁడుపోయి
యొడిసి వశిష్ఠుని హోమధేనువును
బట్టి తెచ్చిన, నేముఁ బదిలమైగదలి
నెట్టనవచ్చుచో, నిజబుద్ధినెఱిఁగి
మనుజులై పొం' డని మాకు వసిష్ఠుఁ
డెనమండ్రకును శాపమిచ్చె; నిచ్చుటయు,
నందిని విడిపించి నయమొప్పుఁగదలి
యందఱమునువచ్చి యతనికిమ్రొక్కి,
చేతులుమొగిచి: "మాచేసినతప్పు
బ్రాఁతియా! మునినాథ, పసలేదుగదవె!
ఈలీలఁ దప్పుగా నేలగైకొంటి!
భూలోకమున నేము పుట్టనోడుదుము;
చచ్చుచుఁ, బుట్టుచు, సకలరోగముల
వెచ్చుచు, వ్యాధితో విహరింపఁగలమె!
మొదల బాల్యంబున, ముదిమి నంత్యమునఁ,
బొదలుయౌవనమున పొక్కంగఁగలమె!
పత్తెంబుమ్రింగుచుఁ, బవలునురేలు
విత్తంబు దలంచుచు విహరింపఁగలమె!
సర్వజ్ఞ, యార్పవే! శాపాగ్ని;" యనిన,
నౌర్వశేయుఁడు మాకు నభయంబులిచ్చి :
'కథలేల! మీలోనఁ గడపటివాఁడు
పృథివి నుండెడుఁగాక పెద్దకాలంబు;
మట్టపునియతితో మానుషయోనిఁ
బుట్టుచు, మరణంబుఁ బొందుఁ డేడ్వురును;
సంతానశూన్యుఁడై సకలభోగముల
పొంతఁబోవనిపుట్టు పుట్టెడు నితఁడు'

  1. యిట్లనుప తత్వరి వాడు పోయి (మూ )