పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

ద్విపద భారతము


గలయఁ దమ్ములసోఁకి కడలులఁ బ్రాకి
ఫలవృక్షములఁదాఁకి పైగాడ్పువొలయ,
నేకతంబుగ సేన యెడగల్గ నిలిపి,
సైకతంబుననున్న సమయంబునందుఁ,

వసువులు గంగతో మొఱవెట్టుట


గామినీవేషంబుగైకొని గంగ
భూమీశుఁగవయంగఁ బూనిపోవంగ,
వసువులడ్డమువచ్చి వరుసతోమ్రొక్కి ,
యసమానదైన్యులై యాగంగకనిరి :
"ఎందుఁబోయెదు గంగ! [1]హితమలరంగఁ
బొందఁబోయెడులాగొ భూపాలతిలకు!
ఈతనిసంబంధ మెఱుఁగుదుమింత,
నీతఁడు మునుమేన నిక్ష్వాకుకులుఁడు;
భీమశార్యుఁడు మహాభీషుఁడను రాజు;
భూమియేలుచు యాగములు పెక్కు చేసి
దేహాంత్యమున బ్రహ్మదేవుని [2]సభ క
నాహతనిజపుణ్యుఁడై పోయి మరలి,
పెరసినతనయిచ్చఁ బెక్కు కాలములు
సురలోకవిభుకొల్వు చొచ్చియుండఁగను,
దేవి, నీవొకదివ్యదేహంబు దాల్చి
యావాసవుని గొల్వ నరుదెంచునపుడు,
[3]నివిడినగాడ్పున నీచీరదొలఁగ,
ధవళాక్షి, మును లెల్లఁ దలవంచుటయును,
అంబరంబు ధరించునాలోన నిన్ను
నంబుజానన, కాంక్ష నాతండు చూచెఁ;

  1. హితమత్తరంగ
  2. సభకు ఆహూత
  3. నీగిన (మూ)