పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

161


అంత నాకులకర్త హస్తిపురభర్త
వింతగా భరతుండు విభుఁడైనవెనుక ,
వెండియు నృపతులు వివిధప్రతాప
[1]ఖండితవైరులై కడునేల భూమి,
శంతనుండను రాజు జనియించి వేడ్క
నెంతయు నేలుచు నెఱవైభవమున,
నీతిసహాయుఁడై [2] నిఖిలభూపతుల
చేతఁ గప్పంబులు చెలువొప్పఁ గొనుచు
వారణ మదవారి వర్షాగమంబు
వారక యేప్రొద్దు వాకిటఁ గలిగి,
కైలాస హిమశైల గంధశైలముల
వాలినతనకీర్తి వన్నియవ్రాయ,
సతులతోఁ బతులయాచ్నావృత్తిదక్క
నితరయాచ్నావృత్తి యిలమీఁద లేక,
పేరిన సురల దుర్భిక్షదోషంబు
వారక క్రతువులవలన మాన్చుచును
ఉర్వియేలుచునుండి, యొక్కనాఁ డతఁడు
సర్వసేనాఢ్యుడై జాహ్నవికడకు
వేఁటలాడఁగబోయి విపినంబుచొచ్చి,
మీటుగల్గిన యుగ్రమృగములఁ జంపి,
శాంతి నెంతయుఁ దూలి, సహకార వకుళ
హింతాల వనరాజి నెనగుజాహ్నవికి
నరుదెంచి, మధురంబులైనతోయములు
గరగలఁదెప్పించి కమ్మగాగ్రోలి,
పూచినగురువింద పొదరిండ్లనీడ
రాచిల్కపల్కుల రసికుఁడైవినుచుఁ,

  1. ఖండితైశ్వర్యులై కడునేలి భూమి
  2. నీతి (మూ)