పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; తృతీయాశ్వాసము.

157


మనముననెఱిఁగి సమ్మతిచేసి, పిదపఁ
దనయుఁడెదిగినదాఁక దనయనిల్పితిమి;
[1] ఇంకీకుమారకు నిల్లాలి నీవు
గొంగక యొప్పుగాఁ గొను.' మనిచెప్పి
పుత్తెంచెమమ్ము నోభూపాల!" యనిన,
నత్తఱి వికలుఁడై యవనీశుఁడనియె:
ఈకన్య నెన్నఁడు నేఁబెండ్లియైతి!
నాకు నీబాలుఁ డెన్నటికుమారకుఁడు!
ఏ నేమియునెఱుంగ! నీభంగి నాకు
గానక కొడిమెలు గట్టంగఁదగునె!”
అనిన, వారలు రాజు కలుక నిట్లనిరి:
“మనుజేశ, యూరకే మఱపుగైకొంటి;
వేము చెప్పఁగనేల! యీ రహస్యములు;
శ్యామశకుంతల సర్వంబుఁదెలుపు”.
ననిన శకుంతల యవనీశుఁబలికె :
"వినుతాత్మ, మఱచితే విజ్ఞానివయ్యు
మున్ను దపోవనంబున వేడ్క నన్నుఁ
గ్రన్ననఁ గామార్థిం గడముట్టఁగూడి,
రాజ్యానుభవమున రాజిల్లి యిపుడు
పూజ్యుండవై యుండి బొంకంగఁదగునె!
ధర్మంబులన్నియుఁ దగఁజేయుకంటెఁ
గర్మోక్తమున నొక్క క్రతువు మేలండ్రు;
ఆక్రతువులు నూఱు నటు సేయుకంటెఁ
సుక్రమస్తుతుఁడగు సుతుఁడు మేలండ్రు;
ఆసుతశతకంబు నందుటకంటె
వాసిగా నొకసత్యవచనంబు మేలు;

  1. ఇంకకొమారికయిల్లాలినీకు (మూ )