పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

156

ద్విపద భారతము


మహితాత్ముడగు కణ్వమౌనిచంద్రునకు
బహుభంగిఁ దపములు పరఁగునె యెపుడు!
దేవ విప్రార్థమై ధృతిఁ గూడఁబోయు
నీవారధాన్యంబు నెలవుగాఁగలదె(వె)!
కందమూలంబులుఁ, గమ్మనిపండ్లు,
నందంద యతిథులకబ్బునే పెట్టఁ?
బరమేశుఁబూజింపఁ బత్రపుష్పములు
వరనదీజలములు వారకకలవె?
మఱియును దక్కినమహితకృత్యములు
[1]దరలక మౌనికిఁ దనరునె యచట!
ఆమహాత్మకుఁ డేమియానతియిచ్చె?
నేముగావించెద మిటు చెప్పవలయు. "
ననవుడు, మునిపుత్రు లతనికిట్లనిరి :
"ఘనుఁడ, కౌరవ వంశకర్తవు నీవు
ఇలయేలుచుండంగ నెల్లవస్తువులు
నిలయీనువిధమున నెసగునెల్లెడలఁ;
బ్రజలకందఱకును బరిణామమెపుడు;
నిజధర్మములుచెల్లు నిఖిలభూములను;
గావున, నెప్పుడు గణ్వసంయమికి
భావింప సుఖముతోఁ బ్రబలుఁదపంబు.
అమ్మౌనివాక్యంబు లాదటవినుము :
నెమ్మి నేలేనిచో నీవనంబునకు
నమరంగ వేటకై యరుదెంచి, నీవు
కొమరె నాకూఁతు శకుంతలాకన్య
గాంధర్వమునఁ బెండ్లికడఁకతో [2]నాడి
బాంధవంబుగఁజన్నపద్ధతిక్రమము
 

  1. దనరక
  2. గూడి (మూ)