పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

ద్విపద భారతము


జంద్రునిలోనున్న సారంగ మటకు
సాంద్ర[1]రయంబునఁ జనుదెంచె ననఁగ
శివునిచే వెలువడి చెలువంపుటిఱ్ఱి
యవలీల నచ్చోటి కరుదెంచెననఁగ
బంగారుకెంజాయ భాసిల్లుమేన
రంగైనయొకయిఱ్ఱి రాజిల్లఁ జూచి:
'చోరవర్తనము లీక్షోణి లేకుండ
నీరీతి నాజ్ఞ నేనేలుచునుండఁ
గాంతకన్నులకాంతిఁ గడఁగి [2]చోరించి
వింతగా నీయిఱ్ఱి విపినంబులోన
దాఁగియున్నదటంచు [3]ధాటితో డాసి
యేఁగి చంద్రుఁడుపట్ట నెసగెనో, యనఁగఁ (?)
జలమునడాసి, దుష్యంతభూవిభుఁడు
బలములచే దానిఁ బట్టింపఁబోయెఁ.
బోయిన, నాయిఱ్ఱి పొడవుగానెగసి,
వాయువేగంబున వలలెల్లదాటి
పఱవఁగఁ గనుఁగొనెఁ బార్థివోత్తముఁడు.
.........................................
అంతంతఁ బఱుచుచు, నిఖిలదిక్కులను
వింతగాఁ బలుమఱు వెఱచిచూచుచును,
గొరిసెచేఁ జెవిక్రింద గోఁకిదీటుచును,
ధరణీశు నలయించి దవ్వుగాఁజనియె
జనిన నారాజును జలమునఁ గొంద
ఱనుచరులును దాను హరిణంబువెంటఁ
బోవఁబోవ, మృగంబు పుణ్యాశ్రమంబు
వేవచ్చిచొచ్చిన, వీక్షించి మౌను

  1. రూపంబున
  2. గోరించి
  3. ధారతో (మూ)