పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

ద్విపద భారతము.


కొంతకాలము వారిఁగూడి యచ్చోట
సంతసంబుననుండి, జగదీశుఁ డంత
మనుమలుఁ దానును మఱియును వేడ్క
పొనరంగఁ బ్రాపించెఁ బుణ్యలోకములు.
ఇట పూరుఁడును శాస్త్రహితమార్గమునను
బటుబుద్ధిఁ గ్రతువులు బహుభంగిఁజేసి,
నడవడి రాజ్యాధినాథులౌనట్టి
కొడుకుల నెక్కుడు కొమరొప్పఁబడసి,
థర్మమార్గమ్మున ధరణియంతయును
ధర్మాత్ముఁడై యేలి ధన్యుఁడై యుండె.
ఈయయాతిచరిత్ర మెవ్వరువిన్నఁ,
బాయుఁబాపంబులు; ప్రబలుఁబుణ్యములు ;
అతఁడువోయిన వెన్క నవనినాయకులు
చతురతఁ బెక్కండ్రు చని. " రనివేడ్క,
జనమేజయునకు వైశంపాయనుండు
మును చెప్పెనని చెప్ప మోదించి వార :
'లనఘాత్మ. తరువాతనైనవృత్తాంత
మనువొప్పఁజెప్పవే! ' యనియడుగుటయు,
[1]గౌరీశ పూజాధిక మతానుచార,
చారణ (సంస్తుత) చరితానుసార,
సారస్వతామృత సాధనధీర,
ధీరాంగరంజితాదిమశుభాకార,
కారాగృహాగత ఘనశత్రుశూర, (?)
శూరతాలంకార, సుజనమందార,
భారతాధిప, నీకుబహుళార్థసిద్ధి.

  1. గౌరీపూజాభికమతాభిచార. (మూ)