పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

139


బోయి యధోలోకముననుండు. " మనిన,
నాయయాతి తలంకి యతనికిట్లనియె:
"అనఘాత్మ, చేసినయపరాధ [1]మునను
ననుగట్టఁ దెచ్చితి నలి నేనె త్రాళ్లు ;
భూలోకమున కేను బోవంగనోప;
నోలి సత్పథమందు నుండెద నిపుడు."
అనుచుఁ బ్రార్థనచేసి యంజలిసేయఁ,
గనికరంబున వజ్రి గైకొని యనిచె.
ననిచిన, నారాజు నాకాశవీథి
కొనరంగనే తెంచి యుండుచో; నంత,
నతనిదౌహిత్రకు లాయష్టకాదు
లతులితతేజస్కు లందుండివచ్చి,
యారాజుఁబొడగాంచి యంజలిచేసి
ధీరతఁబలికిరి: "దేన, నీవిప్పు
డెందుండివచ్చితి ? వెవ్వరవయ్య !
యెందుల కే తెంచి ? తెఱిఁగింపుమాకు. "
అనవుడు రాజన్యుఁ డష్టకాదులకుఁ
దనతెఱంగంతయుఁ దప్పకచెప్పె.
చెప్పిన విని, వారు చెలఁగి హర్షమున
నుప్పొంగి, దండంబు లోలిఁ గావించి :
'యెనయంగ మీకు దౌహిత్రులమేము
మనుజేశ, చెప్పవే మాకుధర్మముల !'
ననుడు యయాతి యయ్యష్టకాదులకు
ఘనతరమహిమలు గలుగంగఁజెప్పి,
ధర్మంబులన్నియుఁ దగ నేర్పరించి,
కర్మంబులన్నియుఁ గడముట్టఁ దెలిపి,

  1. మేను. (మూ)