పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

ద్విపద భారతము.


బహువత్సరంబులు బహువిధంబునను
బహుతపంబులుచేసి, పార్థివోత్తముఁడు
స్వర్గలోకముచేరి, శంభులోకమును
దుర్గమంబైనట్టి ద్రుహిణలోకంబు
మొదలుగాఁగల లోకములయందుఁ బ్రీతి
వదలక కొన్నాళ్లు వసియించి, తిరిగి
సాంద్రవైభవములు చాలఁగైకొనుచు
నింద్రలోకంబునకిరవొందవచ్చె.
వచ్చినఁజూచి యవ్వాసవుండలరి
యచ్చుగాఁబూజించి యాసీనుఁజేసి,
పలికెఁ బార్థివుఁజూచి పరమమోదమున :

యయాతి స్వర్లోకభ్రష్టుఁడగుట

"కలితాత్మ, నీవంటి ఘనపుణ్యచరితు,
మానైన బహువిధమఖ సోమయాజిఁ
గానమెచ్చోటను; గాంతివిశాల,
ఈవుచేసినతపం బేలాటితపము !
భావించిచెప్పు తప్పక నాకు. " ననినఁ
దనలోన నెంతయుఁ దలఁచి, యయాతి
వినతుఁడై హరిఁజూచి వేడ్కనిట్లనియె:
"ఎట్టిదేవతులును, నెట్టిదానవులు,
నెట్టిమునీంద్రులు, నెట్టిరాజులును
జేయంగలేరు నేఁజేసినతపము;
నాయజుండెఱుఁగును నన్యులెఱుఁగుదురె!”
అనినఁ, గోపంబెత్తి యమరనాయకుఁడు
మనుజేశునిట్లను : " మదియించి, నీవు
పెద్దలతపమెల్ల బీరుచేసితివి ;
తద్దయు ధర్మంబుఁదప్పితి; గానిఁ,