పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

137


నాచార [1]వినతులై యతినింద్యులగుచు
భూచక్రమున మ్లేచ్ఛభూమిపాలింపుఁ ; "
డనుచు యయాతి దృహ్వ్యానుతుర్వసుల
కొనరంగ యదునకు నొసగెశాపంబు.
అప్పుడాపూరుండు నాతండ్రికెఱగి,
తప్పక కేల్మోడ్చి తగ నిట్లుపలికె:
'పూనెద నీజర భూనాథ, నాకు
జానొప్ప నిమ్ము నాజవ్వనఁబంది. '
అనవుడు రాజన్యుఁ డతనిహర్షించి,
తనజరాభార మాతనయునకిచ్చి,
వానియౌవనలక్ష్మి వలనొప్పఁదాల్చి,
మానుగా రాజ్యంబు మహిమదీపింపఁ
బెక్కుకాలంబులు పెక్కురీతులను
దక్కక [2]పాలించి ధర్మమార్గమునఁ,
దనయనుభవవాంఛఁ దనిసి మానుటయుఁ,
దనయునిప్రాయంబు తనయునకిచ్చి,
తనవార్ధకంబంది, తన్నాదరించి,
యనువొప్పమన్నించి, యాప్తమంత్రులను
విప్రుల రావించి విత్తంబులొసగి,
సుప్రశస్తంబైన శుభముహూర్తమునఁ
నొనరంగఁ బూరుని యుక్తమార్గమునఁ
దనరఁ బట్టముగట్టి, ధరణీవిభుండు
రాజధర్మంబులు రాజనీతులును
రాజైనసుతునకు [3]రాజిల్లఁజెప్పి,
మునివృత్తిగైకొని, మునులును దాను
వనముల కేఁగి, యవ్వనములలోన

  1. నియతులై.
  2. కావించి.
  3. రాజెల్ల. (మూ)