పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

ద్విపద భారతము.


"భూప, యీముదిమి నీపుత్త్రులలోన
నేపుత్త్రునకు నైన నిచ్చి, నీవిపుడు
వానిప్రాయముగొను ; వలనొప్ప వెనుక
పూని రాజ్యభరంబు పూనునువాఁడె".
అననియ్యకొని, నృపుఁ డతనివీడ్కొనుచుఁ
దనపురికేతెంచి తరుణియుఁ దానుఁ,
గొడుకులనేవురఁగూర్చి యిట్లనియె:

యయాతి యదుప్రభృతుల శపించుట

"వెడగైన ముదిమిచే విహరింపఁజాల;
నుడుగదు భోగేచ్ఛ యొగి నింక నాకు ;
నడుకక మీలోన నలి నెవ్వఁడైన
జవ్వనంబిచ్చి నాజరగొనుం ". డనిన
నవ్వి, యిట్లనిరందు నలుగురు సుతులు :
"విభువర, నీకేమివెఱ్ఱిపట్టినదొ!
విభవులై చరియించు విభుకుమారకులు
చిన్నిప్రాయంబిచ్చి, చెడ్డయీముదిమి
క్రన్ననఁదాల్తురే కడఁకనెందైనఁ !
గొంచక యెటువంటి కూళ[1]మానిసియుఁ
బంచదారకుఁ దౌడు ప్రతి[2]విల్చుకొనునె!
అని విడనాడిన, నారాజు కినిసి
తనయుల నలువురఁ దప్పకపలికె:
"పుత్త్రులా మీరలు! భువి మత్తులార !
శత్రులుగాక ; యేజనకుఁడ మిమ్ముఁ
బనిచినఁ, జేయంగ భావ్యంబుగాదె!
తనరఁ దండ్రికిఁగానితనయులేమిటికి !

  1. మానసలు.
  2. బిల్చు.