పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

ద్విపద భారతము.


అని చెప్పవిందు నే నఖిలశాస్త్రముల ;
విను నీవుబొంకితి వెసఁబెండ్లియందు. "
అనియొడంబఱచిన నతఁడిచ్చగించి,
[1]యొనరిన రత్నంపుటోనరులందు
నిపుణత బహుపుష్పనిర్మితశయ్య
నపరిమితో త్సాహుఁడై పవ్వళించి,
శర్మిష్ఠనీక్షించి, సరసంబులాడి,
మర్మంబులన్నియు మఱి యంటియంటి,
మెఱుఁగుఁ జెక్కిలిగీఁటి, మించుఁబాలిండ్ల
గుఱుతులుగాఁ గొనగోళ్లునాటించి,
బిగియఁ గౌఁగిటఁజేర్చి, బింబాధరంబు
తగవొప్పఁజవిగొని, తద్దహర్ష మున
యువతి మన్మథకేళి నోలలాడించి
యవనీశ్వరుఁడుపోవ ; నపుడు శర్మిష్ఠ
వలుదక్రొమ్ముడి వీడి, వదనంబువాడి,
తిలకకస్తురిజారి, దిటవెల్ల దారి,
తఱుచావులింపుచు, ధవళనేత్రముల
నెఱికెంపుదోపఁగ, నిలుగుచు, మఱియుఁ
బొదవిన సంభోగభూరిచిహ్నము
లొదవంగ, గర్భమై యోగ్యంపుఁదిథుల
దృహ్వ్యానుపూరుల ధృవకీర్తియుతుల
సహ్యధైర్యులఁ గాంచె సత్క్రమంబునను.
అంతట, నొక్కనాఁ డాదేవయాని
కాంతుండుఁ దానును గదియంగనుండి,
శర్మిష్ఠకొడుకులు చదురొప్ప నచటి
కర్మిలినేతెంచి యాడుచుండఁగను,

  1. యొనరినరత్నంబుటొపరిగలిగి - నెపురైనబహుపుష్పనిర్మితశయ్య. (మూ)