పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

ద్విపద భారతము.


శయనంబువెలిగాఁగ సర్వభోగములు
నయవిధి దీనికి నడుపుము నీవు. ”
అనిచెప్పి భార్గవుండటపోయెఁ; బోవ,
మనుజేశ్వరుండును మదిలోననలరి,
దేవయానియుఁ దాను దేవేంద్రుభాతి
భావజరాజ్యసంపదలందుచుండె.
అంత, గర్భిణియైనయా దేవయాని
కెంతయు నరుచితో నెసగెవేవిళ్లు ;
మోమువెల్వెలఁబాఱె; మురిపెంబుదక్కె ;
వేమాఱు నయనముల్ [1]వెల్లనైతోచెఁ
బాలిండ్లముక్కులపస వల్లనయ్యె ;
బాలకి యాలోనఁ బదియగునెలను
యదుఁడు తుర్వసుండను నిరువురసుతుల
ముదమొప్పఁగాఁగాంచె; మోదించి నృపుఁడు
పుత్త్రోత్సవంబులు పొలుపారఁజేసి,
ధాత్రియేలుచునుండె ధర్మమార్గమున.
పుత్త్రులులేని యాభూజనులెల్లఁ
బుత్త్రులఁగాంతు రీపుణ్యకథవినిన.

యయాతి, శర్మిష్ఠకుఁ బుత్త్రదానంబుసేయుట

ఒకనాఁడు వేడ్కతో నుద్యానవనము
కొకఁడు నే తెంచుచో, నొంటిమై నచటఁ
జీఁకటిలోనున్న శీతాంశురేఖ
తేఁకువ నొప్పెడు దేహంబుదాని,
సమ్మతి ఋతుశుచిస్నాతయై వచ్చి
కమ్మనితావులఁ గరమొప్పుదానిఁ,

  1. వేడ్కయై. (మూ)