పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

131


కాన, వివాహంబు కాఁగాఁదు నిన్ను ;
నేను ధర్మముదప్ప నెట్లు సేయుదును ! "
అనవుండు నయ్యింతి యనుకూలయగుచు,
మనమునఁ దమతండ్రి మహితాత్ముఁదలఁచెఁ ;
దలఁచిన, శుక్రుండు తడయకవచ్చి
[1]నిలిచె నాపుత్రికానృపుల కట్టెదుర.
అప్పుడారాజన్యుఁ డాదేవయాని
యుప్పొంగి ప్రణమిల్ల, నుబ్బిభార్గవుఁడు
ఆసీనుఁడై వేడ్క, నవనీశుఁబలికె :
"భానురాత్మక, నీవు పరమపుణ్యుఁడవు ;
రాజవు ; సద్ధర్మరతుఁడవు ; గానఁ,
దేజిత నాకూఁతు దేవయాన్యాఖ్య (?)
నిచ్చితిఁబత్నిగా; [2]నీమె యెల్లెడల
నచ్చినధర్మంబునకు నగు నీకు."
అనుచుఁ బార్థివచంద్రు ననుమతుఁజేసి,
తనపురంబునకు నాతనయతోఁగూడఁ
దోకొని, వేడుకఁదూర్యముల్ [3]మొరయ
భూకాంతునకుఁ బెండ్లి పుత్రికఁజేసి,
దివ్యభూషణములు దివ్యాంబరములు
దివ్యగంధములుఁ బుత్రికి నల్లునకును
గట్టంగనిచ్చి, యాకావ్యుండు వారిఁ
బట్టణంబునకంపి, పార్థి వేంద్రునకు
శర్మిష్ఠఁజూపి సంశయమేదిపలికె:
"ధర్మాత్మ, వృషపర్వదానవేంద్రునకుఁ
గూఁతురీకోమలి, కోమలగాత్రి;
బ్రాఁతి నాపుత్రికిఁబరిచారికనక,

  1. నిలిచె నానృపతిలకాపుత్రిక ట్టెదుర.
  2. నీ వెల్లయెడల.
  3. మెఱయ. (మూ)