పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

125


నెడగల నుడివోలె నింపైననాభి
బడుగునెన్నడుముతోఁ బ్రకటించుదానిఁ
గనుఁగొని, యారాజు కరుణాత్ముఁడగుచు
వనిత వేవెడలించె వలకేలుపట్టి.
ఆరీతి నాకూప మా దేవయాని
వారక వెడలి, యావసుమతీశునకుఁ
దనచరితంబెల్లఁ దప్పకచెప్ప,
వనమువెల్వడివచ్చి పడి యయాతియును
దనపురంబున కేఁగె దళములతోను
చనినంత, భార్గవి చనక యూరికిని
ఘూర్ణికయనుచెలిఁ గోరిరావించి :
"నిర్నిమిత్తము నన్ను నేఁడు శర్మిష్ఠ
నూతిలోపలఁద్రోచి, నూర్గురుఁ దాను
నేతెంచెఁగాన నేనింటికి రాను.
ఈ తెఱంగంతయు నీవిప్పుడేఁగి
మాతండ్రికెఱిఁగింపుమా ! చాలు. " ననిన,
నదియును 'నగుఁగాక' యని పోయి, యతని
కొదవంగ నంతయు నోడకచెప్పె. ;
జెప్పిన, శుక్రుండు చేరంగఁబోయి
తప్పక కూఁతుతో దయనిట్లుపలికె :

శర్మిష్ఠ దాసియై దేవయానిఁగొలుచుట

"ఓబాల, నీ కేల యుగ్రకోపంబు !
[1]ఈబాము లేనుండ నెట్లుగావచ్చు !
శర్మిష్ఠచేసినసాహసంబెల్లఁ
గర్మవశం; బింతె! కందంగవలదు.

  1. ఈబాములనునుండ. (మూ)