పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

ద్విపద భారతము.


"నాపుట్టమిది ; గట్ట నాయమె నీకు !
నేపున నీకట్టునీమైలనాకుఁ
గట్టవచ్చునె ! నాతిక్రమముఁదప్పితివి”.
[1]ఇట్టన, మైమయి వేచి శర్మిష్ఠ
కవిపుత్రికిట్లనుఁ : "గాంత, నేఁజాల
వివరింప కిటఁగట్ట వీడనాతిదవు!
రాచకూఁతురనేను ; రమణ నాయొద్ది
గోఁచిబాఁపనికీవు కూఁతుర వింతె!
నీచీర నేఁగట్ట నెఱిగాదుగాక ;
నాచీరగట్టిన నాతి, నీ కేమి?”

యయాతి, నూతఁబడిన దేవయాని నుద్ధరించుట

అనుచువివాదించి, యసురేంద్రపుత్రి ,
గొనిపోయి భార్గవి గూపంబులోనఁ
ద్రోయించి, యడవిలోఁ దోడనెవచ్చి
ధీయుక్తిఁ బురములోఁ దెమలకయుండె.
అటమున్నె, యాకానయందు యయాతి
[2]పటురీతి మృగకోటిఁబట్టి వేఁటాడి
యానూతిచేరువ నటపోవ, నేడ్పు
వీనులసోఁకిన, వేఁటచాలించి,
తరుణిగాఁదలపోసి, తద్దయువగచి,
పరికించి నూతిలోపలఁ జూచునపుడు,
కనుఁగవఁ గన్నీరు కడునించి యేడ్చి
కొనగోరఁ గన్నీరుగొని మీటుదానిఁ,
బడినభారంబునఁ బయ్యెదజారి
కడలేనికుచకాంతి గప్పినదాని,

  1. యెట్టైననేమైనయేవి.
  2. పటురిమ (మూ)