పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

ద్విపద భారతము.


గిరి శేష మాతంగ కిటి కూర్మములకు
ధరియింపరాక యెంతయు భారమైన,
ధర నిండుచూలుకాంతయుఁబోలె నలసి,
శరధిలో నురగేంద్రశయుఁ గానఁబోయి,
నామంబునొడివి ప్రణామంబుచేసి
లేమ యల్లన లక్ష్మి లేనెత్త లేచి,
నడుఁకుచునిట్లనె: "నాప్రాణనాథ,
జడిసితి మాన్ప వేజింతుభారంబు!
నాకునై కిటివైతి; నలిఁ గూర్మమైతి;
నీకుఁబోవునె దేవ, నేఁటిపట్టునను.
పుక్కిటఁ బదునాల్గు భువనంబులందు
......... .......... .......... ........ ........
ఏనిదే లెక్కకునెక్కుడైనట్టి
మానవమాత్రుల మఱిమోవఁజాల.
[1]ఖిలమైన ధర్మ మీక్రియ రాజసుతులు
చెలువార నాచరించిన ప్రభావమున
శాఖోపశాఖలై చెలువుప్పతిల్ల
లేఖపూజిత, ముప్పులేకయున్నారు.
ఇన్నియు నీమూర్తు; లివి యింకఁ గొన్ని
నిన్ను గూడినఁగాని నిలువలే. " ననినఁ
గరుణించి, ధరఁజూచి కమలాక్షుఁడనియె:
"నరులువ్రేఁగైరని నాతి, యోడకుము ;
నచ్చనియీవ్రేఁగు నరుఁడనై పుట్టి
పుచ్చెద ములు ముంటఁబుచ్చినయట్లు.
ఏనట్లుపుట్టిన, నింద్రాదు లమర
[2]యోనులు నరులుగా నుదయింపఁగలరు.

  1. కిల.
  2. యోనుల నేరులఁ. (మూ)