పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

107


[1]అట్టులె గాక, మత్స్యంబుగర్భమున
బుట్టితి; మానుసుబుద్ధి నెన్నకుము
గుణదోషములలోన గుణములల్పములు;
గణుతింప నేను నీ కాంతికిఁ గలనె!
అతివలయెడలఁ బాత్రాపాత్ర[2]చింత
యతనుండు తా నెఱుంగఁగనీఁడు మొదల;
ఆపాటివారమే! యిటువిడు" మనినఁ,
దాపసారాధ్యుఁ డాతరుణి కిట్లనియె :
"లీల నీతనువు పల్లియవంశమునను
నేలపుట్టఁగనేర్చు నిభరాజగమన!
నీచరిత్రం బేను నిజయోగదృష్టి
జూచితి; నొక్కరాజునకీవుసుతవు.
'మీనగంధము పోదు మేదీఁగె' ననుచు
మానిని, నీవనుమానింపవలదు;
ఘనసార మృగమద ఘనగంధసార
ఘనసార రసములు గలుగునెత్తావి
చుట్టుయోజనమున జోడుముట్టంగ
నెట్టనఁ గలిగింతు నీశరీరమున;
జనులెల్ల నీవు యోజనగంధివనఁగ
వనితాలలామ, ప్రవర్తింతుగాక."
అనునంత, నతనివాక్యప్రభావమునఁ
దనమేన సౌరభతతులుల్లసిల్లి
యీలువసళ్ళింప, నించుక సిగ్గు
జాలివెట్టంగ నాజవ్వనిపల్కెఁ :
“గట్టినవలువూడ్చి, కాంతునితోడ
నెట్టి [3]ప్రౌఢలకైన నీపట్టపగలు

  1. అందునగాధమత్స్యంబు
  2. మింత
  3. ప్రౌఢులకైన (మూ)