పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

ద్విపద భారతము


ముంగొంగు లెగఁద్రోచి మోఁకఱించుటయుఁ,
దొంగలించెదు మిసిమితొడలక్రొమ్మించు,
దర్విచే నుదకంబు తప్పించునపుడు
పర్వి కానఁగవచ్చు బాహుమూలములు,
బలువున మునివ్రేళ్లఁ బలక తొక్కుటయుఁ,
దలదిండులైన పాదముల పెంపులును,
గిన్నెరశ్రుతినాడు కృష్ణాహిపోలె
వెన్నున విహరించు వేణియుఁ జూచి,
కాతుకంబున నోడగడపకయుండఁ
జేతులు ముని పట్టి చెలువ కిట్లనియె :
“అంగజు[1] సాక్షిగా నబల, యిచ్చోట
సంగమమగుఁగాక సరి నీకు నాకు.
ఉత్తమసతితోడ యోగ మౌనేని,
హత్తిన బ్రహ్మచర్యము చెర్గి [2]పోదు ;
చెరిగిపోయినఁ బోయెఁ; జెప్పెడి దేమి?
తెఱవ, నీపొత్తు సంధిలవలె నాకు.
చూచితి శర్వాణిఁ; జూచితి రతిని;
జూచితి హరిరాణిఁ; జూచితి రంభ;
వింతపుట్టి యెఱుంగ; వేయేల! నేఁడు
కొంత, నీయెడ నయ్యెఁ గన్నుల మరులు."
అనిన, ధైర్యముఁ బట్టి యబల యిట్లనియె:
"నను నేల పట్టెడు! నాకుల మెంత!
యేము పల్లియవార; మీవు సన్మునివి!
రామలు లేరె! పరాశరబ్రహ్మ!
[3] చెలువుదైవ మెఱుంగుఁ! జిఱుమీనుపొలను
వలచు నాదేహంబు పతి కయోగ్యంబు.

  1. కాంతిగా
  2. చిర్వవోదు
  3. చిలువదైవ మెరుంగు చిరుమేనుపొలను(మూ)