పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము-ద్వితీయాశ్వాసము

105


మాససహస్రంబు మఱి తీర్థయాత్ర
చేసి, యచ్చోటికిఁ జెలువొప్ప వచ్చి,
లోలవీచుల నాకలోకంబు ప్ఁరాకు
కాళింది దాట నక్కడ త్రోవలేక
'యోడవా రెచ్చోట నున్నారొ' ! యనినఁ,
జేడియ విని వచ్చి చేతులు మొగిచి:
యేతెంచి మునినాథ, యెక్కవే యోడ;
చూతువుగాని నా [1]సూటి యీపనికి;
వావిరి యమునాప్రవాహంబు దాటి
యావల నున్నాఁడవని విచారింపు.
దట్టపుభవవార్ధి దాటెడునీకు
నిట్టికాలువ లెంత! యేతెంతుగాక.”
యనిన నాయింతి నయంబుఁ బ్రియంబుఁ
దనుకాంతియును జూచి, తాపసోత్తముఁడు
కన్నులతళ్కులఁ గల్కిమొగంబు
నన్నువనడుము ధైర్యముఁ జుట్టికొనఁగ,
నతిలావణ్యప్రవాహంబునందుఁ
బతితుఁడై యాకాశపథము చూచుచును,
జాపలంబున బ్రహ్మచర్యధనంబు
తీపువిల్కాఁడనుతెక్కలి గొనఁగ,
నేమియు ననక , మునీంద్రుఁ డయ్యేట
భామినివలకేలు ప్రాపుగాఁ బట్టి,
యుచితాసనంబున నుండి, యాయతివ
కుచములపొబగును, గురులతేటయును,
నయనవిభ్రమమును, నడుములేమియును,
బ్రియదర్శనంబైన పిఱుఁదుఁ, బిక్కలును,

  1. మాలు నాపనికి (మూ)