పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

ద్విపద భారతము


ముత్తెంపుఁజిప్పలో ముత్యమున్నట్లు
చిత్తజుదీమమై చెలువ యొకర్తు
కానవచ్చిన, [1]నిధి కన్న నిర్వేదము
పూనిక నాత్మలోఁ బొంది [2]ధీవరుఁడు
నబ్బాలికామణి నాలిచే నొసగ
గుబ్బుగుబ్బునఁ జన్నుగుబ్బలు చేఁపి
పడఁతి యిట్లను : "దీని భవు డిచ్చెఁగాక!
మడుఁ గెట్లు! మీ నెట్లు! మఱి బిడ్డ యెట్లు!
అనపత్యతాదోష మణఁగెఁబో నేఁడు!
పొసరఁ బొందెడుసొమ్ము పొందునెందున్న
రక్షించి మన మొకరాజున కిత్త;
మక్షణంబునఁ దీఱు నక్కరలెల్ల.
మత్స్యమారణ మింక మానుము నీవు;
మత్స్యగంధనునామ మలరు దీనికిని;
బూని పెంతముగాక పూఁబోఁడి". ననుచు
.........................................................
ఇరువురుఁ బ్రియముతో నేకతమ్మునను
నరయ, నిత్యము నది యభివృద్ధిపొంది,
కరువునఁబోసిన కనకంపుఁబ్రతిమ
కరణి యౌవనవేళఁ గడుఁ జూడనొప్పఁ,
గాళిందిలో నోడ గడప నయ్యతివ
జాలించెఁ గైవర్తచక్ర[3]వర్తియును.

          వేదవ్యాసావతారము
అంతట, నొకనాఁడు హరిపరాయణుఁడు
శాంతిశీలుఁడు పరాశరమునీశ్వరుఁడు,

  1. నిదిగన్ననిర్వేద
  2. దేవలుండు
  3. వర్తులును (మూ)