పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

99


నిట 'తక్షకాయ సహేంద్రాయ' యనెడు
కుటిలమంత్రంబుల చుట్టులు వదలి,
హాహారవంబుతో నంతరిక్షమున
నాహుతి దిరుగుచు నగ్నిలోపలికి
నేతేర నాస్తీకుఁ డెలుఁగెత్తి నిలిపి,
పాతాళమున కంపె భయమెల్ల మాన్పి.
ఎనయంగ నాస్తీకముని ఫుణ్య చరిత
వినిన వారికి లేదు విషధరభీతి,
ఆస్తీకముని మాన్పె, నట్లు యాగంబు
ప్రస్తరింపుట మాని, పారీక్షితుండు
నిగమార్థవిదులకు నిఖిలహోతలకుఁ
దగవొప్ప సంపూర్ణదక్షిణ లిచ్చి,
యెనసిన వేడ్కతో నమ్మునీశ్వరుల (?)
ననుపక తనయూరి కరుదెంచి, యందుఁ
బదివేలపసిడికంబములకూటమున
మృదులతల్పంబున మెఱసి కూర్చుండి
యుచితాసనంబుల నునిచి సన్మునుల
సుచిరతేజస్కుల సొరిదిఁ బూజించి,
వ్యాసు నశేషభావనఁ బూజ చేసి,
యాసంయమికి మ్రొక్కి యంజలి చేసి :
అయ్య, వేదవ్యాస, ఆగమావాస,
నియ్యనుగ్రహములు నిఖిలవేదములు;
నీవాక్యసీమలు నిఖలశాస్త్రములు ;
భావింప నూతనబ్రహ్మవు; గానఁ,
బంచమవేదంబు భారతాఖ్యంబు
మించినవేడ్క భావించినకవివి.
అది నాకు సర్వంబు నానతియీవె!
ముద మొప్ప వినియెద మునులసన్నిధిని.