పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

ద్విపద భారతము.


అని చెప్పి ముని పోయె; నాతనిసుతుఁడ;
దినకరతేజ, యాస్తీకుఁడ నేను.
నన్ను మెచ్చితినంటి; నామాతృకులము
మన్నింపవే! యిట్టిదుఖ మింక వలదు.
ఘనుఁడ, నీచేయునాగప్రళయమున
[1]కనిలుండు, నీలుండు, నాశరభుండుఁ,
గర్కోటకుండును, గాలదంతుండు,
దర్కింపఁ బారావతంబనుపాము,
నక్షతుఁ, డశ్రుతుం, డాకక్షకుండు,
లక్షింప శంఖపాలుఁడు, ధనంజయుఁడు,
మణినాగ శబల వామన కిటింజయ శ
రణ శకునులు, బాండరము ననుఫణులుఁ,
బోనర నేరక ప్రాతపుష్కరకంబు
లనునివిమొదలుగా నన్నియు వెడలెఁ.
గద్రువ మే నెఱుంగక మూర్ఛపోయె.
రౌద్ర మిం కేటి! కుర్వర మోవవలయుఁ!
జక్రిహిం సిది యేల! చక్రిభక్తుఁడవు!
విక్రమం బిది యేల! ద్విజులు పన్నగులు.
గుహ చొచ్చి, పవసంబు గ్రోలుచుఁ జొక్కి,
తుహినాంశునిజకాంతి తూకొనఁగలిగి,
కంచుకమోక్షంబుగలుగు భోగీంద్రు
లించుకవెల్తి యోగీంద్రులుగారె!”
అనుటయు, జనమేజయక్షితీశ్వరుఁడు
కనికరం బెంతయఁ [2]గలిగి నవ్వుచును
ఆక్షణంబున సర్పయాగంబు మానెఁ.
దక్షకుం డావేళఁ, దాను నింద్రుండు

  1. ఈపాముల పేర్లపట్టిక, తుదిమొదలు లేక చీకాకుగా నుండుటచేఁ, గొంతవఱకు నక్షరములపోల్కినిబట్టి కవిత్రయభారతానుసారముగా సవరింపఁబడెను.
  2. గనలి (మూ)