పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము; ద్వితీయాశ్వాసము

97


మానిని కిట్లనె: "మగువరో, యొకటి
నే నీకుఁ జెప్పెద నిర్ణయం బిపుడు,
ఎప్పుడు నీవు నాయిచ్చ నొప్పింతు
వప్పుడు నిను డించి యరుగుదుఁ జువ్వె”.
అని యొడంబఱచి, సంయమి జరత్కారు
నొనరఁ బెండిలియాడి యుండె. నంతటను
నొక్కనాఁ డువిద సూర్యుడు గ్రుంకువేళ
మక్కువ నిద్రించు మగని వీక్షించి:
"తెలుపకుండిన నెట్లొ! తెలిపిన నెట్లొ!
యలర నివ్వలఁ గర్మ మవ్వల సుఖము!
ఏమి సేయంగ నా కేమి యయ్యెడినొ!
పాముతోఁ జెలిమయ్యెఁ బతితోడ నాకుఁ !
గదలి సాంయంతనకర్మంబు [1]దీర్ప
నిదె సర్వమునులు నేఁగెదరు గౌతమికి;
నలిగిన నలిగెఁ; గార్యము చూత.” మనుచుఁ
దెలిపిన, మాతండ్రి దృష్టిఁ గెంపొదవ :
"నే నిద్రపోవుచో నినుఁ డెట్లు గ్రుంకుఁ!
బూని కార్యము తలపోయలేవైతి!
సుఖ మేల చెఱిచితి! సుప్తిఁ బోలంగ
సుఖమెందుఁ గలదు! సుస్థిరమతి ;" ననుచుఁ,
“బతియిచ్చ యెఱుఁగని పడఁతి కాపురము
ధృతిఁ దోవతప్పిన తెరువరియాత్ర;
గావున, నొడఁబాటుగల నిన్ను డించి
పోవనె తగు నాతపోవనంబునకు.
కలఁ డుదయింప నీగర్భగోళమునఁ
గులదీపకుండైన కొడుకు భీతిలకుఁ'

  1. దప్ప (మూ)