పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

94

ద్విపద భారతము


యింద్రుకొల్వున కేఁగి యిట్లను నవని :
"నింద్ర, రక్షింసవె! యేను దక్షకుఁడ;
నొడ లుండఁబట్టకఁ యురగవంశంబు
మడియింపఁదలఁచిన మత్తాత్మకుఁడను
ఎరగొని యొక్కనాఁ డే బరీక్షిత్తు
గఱచితి మీదెఱుంగని పాపమునను.
[1]నోళ్లవలన మున్నును నక్కలుండ
వూళ్లననుమాట వొనఁగూడె మాకు (?)
దర్పించి యారాజుతనయుఁ డొక్కరుఁడు
సర్పయాగం బిఫ్టు జరపుచున్నాఁడు.
చచ్చిన సర్పంబు సంయమిగ్రీవ
నచ్చలంబున వైచె నాపరీక్షిత్తు.
అతనిచే నట్లు మహాశాప మందె;
నితఁ డది తలఁప కిట్లేఁపుచున్నాడు.
[2]ప్రోవుగా మాసర్పములు గూలె నగ్ని;
నే వెరవునఁ దప్పు నీబారి నాకు!
దయమాలి మంత్రాధిదైవంబు నన్ను
బయనమై యున్నది పట్టుకపోవ.
జీవరక్షార్థమై శేషవాసుకులు
శ్రీవిష్ణు నభవునిఁ జేరిరి మున్ను.
సకలలోకైకరక్షకుఁడవు గాన ,
“ నొకఁడ నే వచ్చితి [3]నోము న' న్ననుచుఁ
గోర, దేనికి మందుగోరని యమృత
ధార దాఁచితి; రది తగిలె మీచేతఁ;
బుడెసెఁ డాయమృతంబు పోయింపు నాకుఁ;
గడపెద నీబారి కరుణావిధేయ!”

  1. ఈద్విపద అనన్వితముగా నున్నది. ఇట్లు సవరించినఁ గొంతసరిపడునేమొ!
    “తోళ్లు నమలిన జిత్తులనక్క లుండ
    నూళ్లఁ గుక్కల మోఁదు టొనఁగూడె మాకు."
  2. పోనెనానా
  3. నోడకు మనుచుఁ గోర నేటికి (మూ)