పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిపర్వము-ద్వితీయాశ్వాసము

93


మత్తిల్లు ఫణిఫణామణిదీప్తితోడ,
బిత్తరమ్ములు చిమ్ము పెదవులతోడ,
నక్కు వాయని దంటనాల్కలతోడ,
మక్కలించిన పొట్టమడతలతోడ,
మాయపుఁ బలువన్నె మచ్చలతోడఁ
బాయక చిగురుఁగుప్పసములతోడఁ.
దొరఁగునప్పటి హోమధూ[1]మమ్ము తాకఁ
దిరమేది మూర్ఛిల్లె దేవలోకంబు;
హోతలు శాలలో నుండలేరైరి;
యాతాపమునఁ గ్రాఁగె నఖిలదిక్కులును;
మడిసిరి కొందఱుమనుజు లావేళ,
నడుమింట రానోడె నక్షత్రకులము.
వెలయ నధ్వరవహ్ని విషవారిఁదోఁగి
మలినమై రాఁజి, క్రమ్మఱఁ బ్రజ్వరిల్లఁ,
గుటిలఫణారత్నకోటులు చిటిలి
పెటపెటధ్వనిఁ బాఱె బ్రిదిలి యవ్వలికిఁ.
ౙలౘల నురియు మాంసములచప్పుళ్లు
చలములు గొని కులాచలములఁ బొదివె.
చచ్చియు, నొకకొన్ని సామగానముల
పచ్చితీపుల నిల్పెఁ బ్రాణవాయువులు.
కాలకంఠుఁడు చూచె గడియంబు ముట్టి;
నీలకంఠముఁ బట్టె నెఱవైనభయము.

తక్షకుఁ డింద్రు శరణుచొచ్చుట



అప్పుడు, తక్షకుం డార్తరావంబు
ముప్పిరిగొన దర్భముఖములు గఱచి,

  1. ధూమ్రమ్ము (మూ)