పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

ద్విపద భారతము


సుప్రతీకాఖ్యుం డచ్చోటికి వచ్చి,
యప్రయాసంబున నతనికి విత్త
మేరాళముగఁ గల్గు టెఱిఁగి తా నతనిఁ
జేరి యిట్లనియె: "నొచ్చితి; బేద నైతిఁ;
బితృ[1]పితామహులెల్లఁ బెంపారఁ దొల్లి
యతులధనాఢ్యులై యందఱు నేఁగ ,
దాఁచిన యర్థమంతయు నొక్కరుఁడవె
చూచి చేకొంటి; వచ్చుగ విభాగించి
నాకు నీవలదె ధనంబులో సగము!
చేకొని తండ్రి చేసినఋణంబున్న
వడిఁ బంచి నా కిచ్చువాఁడవు గావె!
గడుసరితన మేల! కన్నవారెల్ల
నగుదురు; గాన, సన్నకుసన్నధనము
సగమి" మ్మటంచు వేసరక వేడుటయు,
నలిగి, విభావసుం డర్థలోభమునఁ
బెలుచఁ దమ్మునిజూచి "పృథివిపై గజమ
వై యుండు” మని శాప మర్థి నిచ్చుటయు,
నాయెడ సుప్రతీకాఖ్యుండుఁ గనలి,
శాపించె మఱల గచ్ఛపముగా మిగులఁ
గోపించి మదిఁ గొంకుఁ గొసరును లేక.
సరవి న ట్లన్యోన్యశాపముల్ వార
లిరువురుఁ గాంచిరి; యేనుగౌ వాఁడు
మొగి నాఱుయోజనంబుల విస్తృతంబు,
తగనున్నతంబు ద్వాదశయోజనములుఁ
గలిగి, యొక్కెడ నొక్కకానలో నుండఁ,

జలముతో నంతఁ గచ్ఛప మగువాఁడు
  1. మాతా (మూ)