పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ద్వితీయాశ్వాసము

69


నియ్యెడఁజాకుండ నేనడ్గి వేగఁ
జయ్యన బ్రదికింతుఁ జలమున" ననుచుఁ
దనరినభక్తి వృద్ధశ్రవుఁ గూర్చి
వినయంబుతో నిట్లు వినుతి యొనర్చె:
“దేవతాధీశ, యతిస్తోత్రపాత్ర,
పావకప్రభృతి దిక్పాలకసేవ్య,
శ్రీపతి సత్కృపాశ్రీయుత, వజ్రి,
పాపవిదూర, సౌభాగ్యసంపన్న,
మాపాలఁ గృప గల్గి మమ్ము రక్షింప
నీపాఁపకొదమల కిమ్ము ప్రాణంబు."
లనిన నింద్రుఁడు కృప నాశీవిషముల
తనువులు దడుపుసుధాధారవృష్టి
గురియింప, మూర్ఛగైకొనినసర్పములు
వరుసతో బ్రతికె నవ్వాసవుకరుణ.
నప్పుడు కద్రువ యతిరాజసమున '
నెప్పటిపోల్కి నయ్యిరువురిచేతఁ
బనిగొనుచుండ, నాపన్నగాంతకుఁడు
జననికి నొకనాఁడు సద్భక్తి మ్రొక్కి  :
"తల్లి, ని న్నిది యేమి! తవిలి మీవార
లిల్లాదిగా వీరి కిచ్చిరొ వెలకుఁ!
గాదేని, నీ కొండుకడ దిక్కులేమి
నీదెస పొంది నీ విడుమఁబొందెదవొ!
కాకున్న, [1]ననదవై కడుపుఁగూటికిని
ఈకద్రువకుఁ బను లిట్లు చేసెదవొ!
అదిగాక, ప్రతినకునై పూని తగవు
వదలక యిట్లుండవలసెనో నీకు!

  1. నవతమై (మూ )