పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము


శ్రీలక్షితాకార, శ్రితజటాభార,
లాలితగుణధామ, లంకావిరామ,
శరణని తలఁచు సంసారభీతులకు
వరము లీనేర్చు దేవా! చిత్తగింపు;
అక్కథకుఁడు శౌనకాదిసన్మునుల
కక్కథాసూత్ర మిట్లని చెప్పఁ దొడఁగె:

  

గరుడోత్పత్తి



"అత్తఱి నొక్కనాఁ డతివిచిత్రముగ
నుత్తుంగ[1]తైజసయోగాప్రమేయ
మయ్యున్న యండంబు సవిసిన, నందుఁ
జయ్యన సూర్యతేజఃప్రకాశుండు,
వితత[2]పక్షాంచలావిర్భూతవాత
హతసప్తశైలసంహతుఁడు ధీమంతుఁ
డుదితుఁడై, పవిచేత నూనంబుగాని
ఛదములుగల కులాచలమో యనంగ
దిగ్గన నెగసి, యేతెంచి వేగమున,
నగ్గరుడఁడు తల్లి కందంద మ్రొక్క,
వినమితుండగు పక్షివిభు [3]సవతితల్లి
కనుఁగొని సంతోష[4]కలితయై పలికె? :
"వినుము నీడోద్భవ, వినతకు నింటి
పనులు దీర్పఁగవలెఁ; బడుచులఁ బట్టఁ
దీఱదు వీరి నెత్తికొని చరింపు ;

సారెకు నీకు నిచ్చలుఁజె ప్పవలదు.
  1. తేజసంయోగప్రయోగ
  2. పక్షానిలా
  3. జూచి తల్లి
  4. కలితుండై (మూ )