పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆది పర్వము ; ప్రథమాశ్వాసము

65


భోగింప రహిచెడ్డ ముత్యంబు లనఁగ
బాగైనమించులఁ బ్రబలకతార
లొగి నాకసమున నొండొండ యడంగె
.................................................
మొదలిగ్రహంబు, త్రిమూర్త్యాత్మకంబు,
చదువులముద్ద, శాస్త్రంబులపెద్ద,
కమలాప్తుఁ, డేకచక్రరథస్థితుండు,
.................................................
కాలచక్రం బవక్రతఁ ద్రిప్పుప్రోడ,
.................................................
పద్మరాగపుసానఁబట్టి కెంపెక్కె.
..................................................
అప్పుడు కద్రువ, యావినతయును,
నొప్పుగా గెలుపు లొండొరులు [1]పేర్కొనుచుఁ
[2] దలరి, యాందోళచిత్తాకులత్వమున
జలనిధితీరభూస్థలికి వేవేగఁ
జని, డాసి చూడ, నుచ్చెశ్శ్రవం బపుడు
గొనకొని కర్కోటకునిమాయవలన
సితదేహమున మహాసితవాలమునను
నతులమైయుండెను; అప్పు డావినత
లజ్జించి:"మిగుల నేలా మాటలింక!
నొజ్జయై విధి నన్ను నొగి నింతచేసె!
అలసి, యనూరుశాపాధిదైవతము
కొలఁది కద్రువ కనుకూలమై మాయ
పన్ను టే నెఱుఁగక, పన్నిదంబాడి

విన్ననై వగలచే వేగంగవలసె."
  1. వేడ్కొనుచు
  2. తరలి యాందోళచిత్తానుకూలమున (మూ)